- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంకా రోడ్డే ఎక్కలే.. అప్పుడే కాంగ్రెస్ నేతలకు ఉలిక్కి పాటు ఎందుకు: ఎమ్మెల్యే వివేకానంద
దిశ, తెలంగాణ బ్యూరో: ‘మేము రోడ్లు ఎక్కలేదు ధర్నాలు చేయలేదు.. కాంగ్రెస్ నేతలకు అప్పుడే ఉలిక్కి పాటు ఎందుకు ?’ అని ఎమ్మె్ల్యే కేపీ వివేకానంద అన్నారు. వ్యక్తిగత ఆరోపణలు మాని సీఎం రేవంత్ రెడ్డి హామీల అమలుపై దృష్టి సారించాలని సూచించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. మల్కాజిగిరి లోక్ సభ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడంలో కేటీఆర్ ముద్ర ఉందన్నారు. మంత్రిగా ఆయన నగర అభివృద్ధికి చూపిన ప్రత్యేక చొరవ ఈ ఫలితాలకు నిదర్శనం అన్నారు. మల్కాజ్ గిరి ఎంపీగా రేవంత్ చేసిందేమి లేదని ఆరోపించారు. హామీల గురించి అడిగితే మంత్రులు వారి స్థాయిని మరచి విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
హామీలను గుర్తు చేస్తే బెదిరింపులా అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను మోసగించడానికే కాంగ్రెస్ అమలు కానీ హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ పేరు చెప్పి హామీలను కాంగ్రెస్ ఎగవేస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తీరును పార్లమెంటు ఎన్నికల్లో ఎండగడుతామన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని ఆ రెండు పార్టీల నేతల తీరు చెప్పకనే చెబుతుందన్నారు. సీఎంగా రేవంత్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ప్రజలను కాంగ్రెస్ నేతలు అయోమయాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకునే వ్యూహంతో ముందుకు సాగుతున్నామన్నారు. పార్టీని బలోపేతం చేసుకుని ముందుకు సాగుతామన్నారు.