నేను ఒక్కడ్ని మాట్లాడితే.. 8 మంది మంత్రులు అడ్డుకున్నారు: హరీష్ రావు

by Satheesh |   ( Updated:2024-02-17 16:01:14.0  )
నేను ఒక్కడ్ని మాట్లాడితే.. 8 మంది మంత్రులు అడ్డుకున్నారు: హరీష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేఆర్ఎంబీపై మేం గొంతువిప్పాకే.. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేశారని అన్నారు. శనివారం అసెంబ్లీ సెషన్ ముగిసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో ఇరిగేషన్‌పై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక అని అభివర్ణించారు. ప్రభుత్వం పెట్టింది వైట్ పేపర్ కాదు ఫాల్స్ పేపర్ అని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ వైట్ పేపర్‌లో స్థిరీకరణ, ఆయకట్టుపై వాస్తవాలు దాచి పెట్టారన్నారు. నాలుగు ఎంపీ సీట్ల కోసం మేడిగడ్డ బ్యారేజీని భూతద్దంలో చూపిస్తున్నారని మండిపడ్డారు.

రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి రైతుల సంక్షేమం పట్టించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక మేడిగడ్డ అంటు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నేను సభలో ఒక్కడిని మాట్లాడుతుంటే 8 మంది మంత్రులు అడ్డుకున్నారని, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తప్పించుకున్నారని అన్నారు. కాగ్ నివేదిక పనికిరాదని ఆనాడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు, వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి సైతం కాగ్ నివేదికను గతంలో తప్పుబట్టారని గుర్తు చేశారు. అదే కాగ్ మమ్మల్ని ఎన్నోసార్లు మెచ్చుకుందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed