‘100 రోజుల కాంగ్రెస్ పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్య’

by GSrikanth |
‘100 రోజుల కాంగ్రెస్ పాలనలో 180 మంది రైతులు ఆత్మహత్య’
X

దిశ, వెబ్‌డెస్క్: జనగామ జిల్లాలోని దేవరుప్పల మండలంలో ఎండిన పంటలను బీఆర్ఎస్ నేతలతో కలిసి మాజీ మంత్రి హరీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సాగునీరు లేక 20 లక్షల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల బలవన్మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని అన్నారు. రైతులను ఓదార్చే ఓపిక అటు ముఖ్యమంత్రికి, ఇటు మంత్రులకు ఎవరికీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ చేరికల కోసం స్వయంగా ముఖ్యమంత్రే ఎమ్మెల్యేల ఇంటికి వెళ్తున్నారు.. రైతుల పంటలు పరిశీలించడానికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు తెరవాల్సింది పార్టీ గేట్లు కాదు.. ప్రాజెక్టుల గేట్లు అని ఎద్దేవా చేశారు. పంటనష్టం జరిగిన రైతులకు ఎకరానికి రూ.25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed