- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
MLA Padi Kaushik Reddy : బీఆర్ఎస్ నాయకులు అరెస్టుపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైర్

దిశ, వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీకార్యాలయం(Brs Party Office) పై కాంగ్రెస్ దాడి(Congress Attack)ని నిరసిస్తు ధర్నాలకు సిద్ధమైన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అక్రమ అరెస్టు(Illegal Arrests)లు చేస్తున్నారని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) మండిపడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సహా హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్టులు చేయడాన్ని, గృహ నిర్భంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు అక్రమ అరెస్టులకు తెర లేపడం దుర్మార్గమని విమర్శించారు. పోలీసు బలం ఉపయోగించి, ప్రతిపక్షాలను అణిచివేయాలని చూడటం అప్రజాస్వామికమన్నారు. అక్రమ అరెస్టులు చేసిన బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.