- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేటీఆర్, హరీశ్ ఎన్ని చేసినా ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉండరు: MLA
దిశ, వెబ్‌డెస్క్: ఫిరాయింపులపై బీఆర్ఎస్ చేస్తోన్న ఆరోపణలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్, హరీశ్ రావు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎమ్మెల్యేలు వారితో ఉండేందుకు ఇష్టంగా లేరని అన్నారు. ఢిల్లీకి వెళ్లినా వారు ఆ పార్టీలో కొనసాగుతారని నమ్మకం లేదని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏనాడూ స్పీకర్లు ఫిరాయింపులపై చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. ఈ పదేళ్లలో దాదాపు 60 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకున్నారని అన్నారు. ఫిరాయింపులకు పాల్పడినన్ని రోజులు రోజులు పాల్పడ్డారు.. ఇప్పుడేమో పెద్ద పెద్ద నీతి సూక్తులు చెబుతున్నారని విమర్శించారు. కేవలం కవిత బెయిల్ కోసమే వారు కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీలో తిరుగుతున్నారని అన్నారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాదాపు ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు చేరికకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతూ వస్తున్నారు.