- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డీసీసీబీలలో తప్పులు జరిగాయ్.. మళ్లీ పునరావృత్తం కావద్దు : తుమ్మల వార్నింగ్
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టీజీసీఏబీ ) పని తీరు, ఆర్థిక అంశాలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదివారం సమీక్షించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్లోని టీజీసీఏబీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించగా టీజీసీఏబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతు ఋణమాఫీ, బ్యాంక్ పనితీరుపై అధికారులకు తుమ్మల నాగేశ్వరరావు పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రుణ మాఫీ 2024 కింద లబ్ది పొందిన రైతులకు త్వరితగతిన తిరిగి కొత్త పంట రుణాలు ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా గతంలో వివిధ డీసీసీబీలలో కొంత మంది అధికారులు, పాలక వర్గాల నిర్లక్ష్యంతో కొన్ని తప్పులు జరిగాయని అటువంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని వారికి సూచించారు. 2025 సంవత్సరం సహకార సంఘాలకు ప్రత్యేక మైనదని, ఉద్యోగులు అందుకు తగ్గట్టుగా అద్భుత పని చేసి రైతుల పురోగతిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు.
అనంతరం తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ 2025 నూతన సంవత్సర డైరీ, కాలెండర్లను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో టీజీ సీఏబీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి. గోపి ఐఏఎస్, పి. ఉదయ్ కుమార్, ఐఏఎస్, (ఎఫ్ఎసీ) సహకార డైరెక్టర్ ఫర్ కో-ఆపరేషన్ అండ్రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్స్, అడిషనల్ ఆర్సీఎస్జి. శ్రీనివాస రావు, టీజీసీఏబీ పాలక వర్గ సభ్యులైన హైదరాబాద్ బీసీసీబీ అధ్యక్షులు కొత్తకుర్మ సత్తయ్య, ఆదిలాబాద్ డిసిసిబి అధ్యక్షులు అద్ది భోజా రెడ్డి, ఖమ్మం డిసిసిబి అధ్యక్షులు దొండపాటి వేంకటేశ్వర రావు, మహబూబ్ నగర్ డిసిసిబి అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మెదక్ డిసిసిబి అధ్యక్షులు చిట్టి దేవేందర్ రెడ్డి, నల్ల్గొండ డిసిసిబి అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ డిసిసిబి అధ్యక్షులు కుంట రమేశ్ రెడ్డి, ప్రొఫెషనల్ డైరెక్టర్ పి. మోహనయ్య, టీజీసీఏబీ చీఫ్జనరల్ మేనేజర్ టి. జ్యోతి , ఇతర అధికారులు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.