- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
SLBC Tunnel : ఎస్‌ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై స్పందించిన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలు

దిశ, వెబ్ డెస్క్ : ఎస్‌ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel Accident)పై కప్పు కూలిన ప్రమాదంపై ఇరిగేషన్ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి(N. Uttam Kumar Reddy), రోడ్లు భవనాల శాఖ మత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy)లు స్పందించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను ప్రమాద స్థలానికి వెలుతున్నానని, సహాయచర్యలను పర్యవేక్షిస్తానని తెలిపారు.
నీళ్లు లోపలికి రావడంతో పై కప్పు కూలడానికి కారమైనట్లుగా సమాచారం ఉందని..వాస్తవమైన పూర్తి సమాచారం రావాల్సి ఉందన్నారు. టన్నెల్ లోపల కాంట్రాక్టు సంస్థ కూలీలు ఉన్నారని..ఇప్పటివరకు అందరిని రక్షించినట్లుగా సమాచారం ఉందని..ఇంకా ఎవరైన ఉన్నారా అన్న విషయమై పరిశీలన చేస్తున్నారన్నారని తెలిపారు. తాను అక్కడికి వెళ్లాకే పూర్తి వివరాలు వెల్లడించగలనని చెప్పారు. హెలిక్యాప్టర్ ద్వారా వెలుతున్నట్లుగా తెలిపారు.
టన్నెల్ ప్రమాదంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీశైలం నుంచి దేవరకొండ వైపు వెళ్లే టన్నెల్ 14 కిలోమీటర్ ఇన్ లెట్ వద్ద (దోమలపెంట దగ్గర)ఉదయం ప్రమాదం జరిగిందన్నారు. సీ పేజ్ ను పూడ్చివేసిన కాంక్రీట్ సెగ్మెంట్ స్లిప్ అవడంవల్ల ప్రమాదం సంభవించిందని సమాచారం ఉందన్నారు.
టన్నెల్ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారని తెలిపారు. ఇప్పటికైతే ప్రమాదంలో ఎవరికి ప్రాణాపాయం లేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు.