Podu Lands issue: పోడు భూములపై ఫోకస్.. కీలక అంశాలపై మంత్రులు కొండా సురేఖ, సీతక్క, రివ్యూ

by Prasad Jukanti |   ( Updated:2024-08-17 09:18:16.0  )
Podu Lands issue: పోడు భూములపై ఫోకస్.. కీలక అంశాలపై మంత్రులు కొండా సురేఖ, సీతక్క,  రివ్యూ
X

దిశ, తెలంగాణ/డైనమిక్ బ్యూరో: పోడు భూముల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పోడు భూములపై మంత్రి కొండా సురేఖ, సీతక్క రాష్ట్ర సెక్రటేరియట్‌లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ రివ్యూలో పోడు భూముల తగాదాలు, అర్హుల గుర్తింపుపై ఉన్నతాధికారులతో చర్చించారు. పోడు పట్టాల కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా క్లియర్ చేయాలని మంత్రులు ఆదేశించారు. అటవీ, గిరిజన శాఖలు మరింత సమన్వయంతో పనిచేసి పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. పోడు పట్టాల కోసం దరఖాస్తుదారులను పదే పదే తిప్పుకోవడం సరికాదన్నారు. పట్టాలు ఇచ్చేందుకు అర్హత లేకపోతే అదే విషయాన్ని దరఖాస్తుదారులకు వివరించాలన్నారు. ఎస్టీలు, అటవీ శాఖ సిబ్బంది మధ్య ఘర్షణ వాతావరణాన్ని నివారించాలని, కొత్తగా అడవులు నరకకుండా ప్రజలకు అవగాహన పెంచాలని సూచనలు ఇచ్చారు. అడవుల్లో పండ్ల మొక్కలను పెంచి స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ ప్రాంత ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు, డీఎఫ్ఓ, ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story