రోడ్ల వర్క్ ప్రోగ్రెస్ ను నేనే పరిశీలిస్తా.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

by Javid Pasha |
రోడ్ల వర్క్ ప్రోగ్రెస్ ను నేనే పరిశీలిస్తా.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : పీరియాడికల్ రెన్యువల్ రోడ్ల మరమ్మతుల పనుల్లో వేగం పెంచాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో ఆర్అండ్బీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1170 పీరియాడికల్ రెన్యువల్ రోడ్ల మరమ్మతుల పనుల కోసం 2875 కోట్లు మంజూరయ్యాని,అందులో సుమారు 570 కోట్లతో 232 పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో ఆర్ అండ్ బీ రోడ్లు అద్దంలా తయారవుతున్నాయని వెల్లడించారు.

ప్రణాళిక ప్రకారం మూడున్నర నుంచి నాలుగు నెలల్లోపు అంటే జూన్ నాటికి అన్ని పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏజెన్సీలు పనులు చేపట్టారని, ప్రతీ ఏజన్సీ వారానికి కనీసం ఒక పని పూర్తి చేయాలని ఆదేశించారు. పురోగతిలో ఉన్న మిగతా 938 పనులను వారానికి 60 చొప్పున నెలలో 240 పనులు టార్గెట్ పెట్టుకొని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీవారం స్వయంగా రోడ్ల వర్క్ ప్రోగ్రెస్ పరిశీలిస్తానని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్ అండ్ బీ సెక్రటరీ శ్రీనివాస్ రాజు,స్పెషల్ సెక్రెటరీ విజయేంద్ర బోయి,ఈఎన్సీ రవీందర్ రావు, ఇతర ఆర్ అండ్ బీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed