శ్రీశైలం, సాగర్ కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు అప్పగించేది లేదు: ఉత్తమ్

by Ramesh N |
శ్రీశైలం, సాగర్ కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు అప్పగించేది లేదు: ఉత్తమ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కృష్ణా జలాల్లో తెలంగాణకు చట్టబద్ధమైన వాటా దక్కాల్సిందేనని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంచేశారు. జలసౌధలో ఇవాళ సుప్రీం కోర్టు, ట్రైబ్యునల్ పెండింగ్‌లో ఉన్న అంతర్ రాష్ట్ర నీటి వనరుల సమస్యలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌, లాయర్ల బృందంతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటాకు అన్న చర్యలు తీసుకోవాలన్నారు.

సుప్రీంకోర్టు, ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని, ట్రైబ్యునల్ తీర్పు వచ్చేవరకు సగం వాటా కోసం ప్రయత్నించాలని అధికారులకు వెల్లడించారు. శ్రీశైలం, సాగర్ కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు అప్పగించేది లేదన్నారు. కృష్ణా జలాల్లో వాట, ప్రజల ప్రయోజనాల కోసం చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకతో చర్చలు జరపడం మంచిదన్న వైద్యనాథన్ బృందం.. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహారాష్ట్ర, కర్ణాటకతో చర్చలకు అనుమతి ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed