ఈ రాత్రికే భారత సైన్యం రాబోతోంది.. మంత్రి ఉత్తమ్ ప్రకటన

by Gantepaka Srikanth |
ఈ రాత్రికే భారత సైన్యం రాబోతోంది.. మంత్రి ఉత్తమ్ ప్రకటన
X

దిశ, అచ్చంపేట: శ్రీశైలం ఎస్‌ఎల్‌బీసీలో జరిగిన ప్రమాదం కారణంగా టన్నెల్‌(SLBC tunnel accident)లో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు భారత సైన్యం(Indian Army), ప్రకృతి వైపరీత్యాల కారణంగా తలెత్తే ప్రమాదాలను కాపాడే బృందం శనివారం రాత్రి వరకు ప్రమాదవస్థలికి చేరుకుంటారని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy), జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎస్‌ఎల్‌బీసీలో పనులు ప్రారంభం అయ్యాయి.. ఒక దగ్గర చిన్న క్రాక్ ఏర్పడి.. ఒక్కసారిగా కులడంతో ప్రమాదం సంభవించినట్లుగా మంత్రులు తెలిపారు. బోర్ మిషన్ ముందు కొంతమంది.. కుడి.. యడమల పక్కన మరికొందరు.. వెనకాల కొంతమంది కార్మికులు వెళుతుండగా 14 కిలోమీటర్ వద్ద 8 మీటర్ల మేరా మట్టికూలి టన్నెల్ మూసుకుపోయిందని మంత్రులు తెలిపారు.

బోర్ మిషన్ ముందు వెళ్లినవారు మినహాయించి మిగిలిన వారు అందరూ సురక్షితంగా బయటకు రాగలిగారని మంత్రులు.. సంబంధిత కంపెనీ ఉద్యోగులు వెల్లడించారు. టన్నెల్‌లో మిగిలిపోయిన వారిని కాపాడేందుకు స్థానికంగా ఉన్న రిస్కీ టీం, పోలీసులు, ఇతర సిబ్బంది ప్రయత్నాలు చేసిన ప్రయోజనం లేకపోయింది. వీరిని కాపాడేందుకు భారత సైన్యాన్ని, నేషనల్ డిజాస్టర్ టీంను రప్పిస్తున్నామని.. వారు ఈరోజు రాత్రి వరకు శ్రీశైలం‌కు చేరుకొని టన్నెల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రులు తెలిపారు.

Next Story