- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Minister Uttam: ఆ సోయి ఇద్దరికీ లేదు.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రైతులకు మేలు చేయాలనే బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) నేతలకు లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) విమర్శించారు. శనివారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. డిసెంబర్‌లోపు మరో రూ.10 వేల కోట్ల రుణమాఫీ(Runa Mafi) చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) నేతలకు రైతులకు న్యాయం చేయాలనే సోయి లేదని అన్నారు. కనీసం చేస్తుంటే మద్దతు ఇవ్వకపోగా.. విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే హంగామా చేస్తున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలుకు రూ.30 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రైతుల గురించి బీజేపీ(BJP) మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో అన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా బీజేపీ ఎందుకు మద్దతు ధరపై చట్టం చేయలేదని అన్నారు. 30 శాతం తేమతో ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని హితవు పలికారు. రాష్ట్రంలో కొనుగోలు చేసేందుకు తాము సిద్ధంగా ఉందని ప్రకటించారు.