రైస్ మిల్లర్లకు ఆ విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా

by Rajesh |
రైస్ మిల్లర్లకు ఆ విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా
X

దిశ, వెబ్‌డెస్క్: రైస్ మిల్లర్లకు ప్రభుత్వం నుంచి వేధింపులు ఉండవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్‌లో మూడు రోజుల పాటు జరిగే మూకాంబికా రైస్, గ్రెయిన్ టెక్ ప్రదర్శనలో మంత్రి ఉత్తమ్ పాల్గొన్నారు. ప్రదర్శనలో బహుళజాతి, ప్రైవేట్ కంపెనీలకు చెందిన 120 స్టాళ్లను ఏర్పాటు చేశారు. కంపెనీ స్టాళ్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. రైస్ మిల్లింగ్ పరిశ్రమను ముఖ్యమైన రంగంగా గుర్తిస్తామన్నారు. రైస్ మిల్లింగ్ వ్యాపారం, అనుమతులు, స్థాపన సులభతరం చేస్తామన్నారు. రైతులు, మిల్లర్లకు మేలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే ప్రజలకు అందించాలన్నారు. మిల్లర్లు ఎవరూ పీడీఎస్ బియ్యం జోలికి వెళ్లవద్దన్నారు. పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story

Most Viewed