తెలంగాణ రైతులు సంతోషపడే న్యూస్.. అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |
తెలంగాణ రైతులు సంతోషపడే న్యూస్.. అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైతుల(Telangana Farmers)కు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Minister Tummala Nageswara Rao) మరో గుడ్ న్యూస్ చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రబీ సీజన్‌(Rabi season)కు కూడా సాగు విస్తీర్ణం ఉంటుందని అన్నారు. శ్రీశైలం(Srisailam), నాగార్జున సాగర్(Nagarjuna Sagar) నీటి వాటాలపై జాగ్రత్తగా ఉండాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కడుపులో పెట్టుకుని చూసుకుంటోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.2 లక్షల రుణమాఫీ(Runa Mafi) చేయడం ఇందుకు నిదర్శనం అని తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా విద్యుత్ అందించాలని అధికారులకు సూచించారు.

నాణ్యమైన విద్యుత్ అందేలా చూడాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. జనవరి 26వ తేదీ నుంచి ప్రభుత్వం రైతుభరోసా పథకాన్ని అమలు చేయబోతున్న విషయం తెలిసిందే. రైతుభరోసా పథకం కింద రైతులు, కౌలు రైతులకు ప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి రూ.12,000 చొప్పున అందించనుంది. ఎన్ని ఎకరాలు సాగు చేస్తే అన్ని ఎకరాలకు ఇస్తామని ప్రకటించింది. తనిఖీ బృందాలు తమ దగ్గరకు వచ్చినప్పుడు.. రైతులు తమ దగ్గర సాగుకి యోగ్యంగా ఉన్న అన్ని భూములూ చూపించాలి. లేదంటే.. పంట ఉన్న వాటినే రాసుకొని అధికారులు.. అంతవరకే మనీ ఇచ్చే ప్రమాదం ఉంటుందని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించిన సంగతి తెలిసిందే.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story