- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన నేతలు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి తుమ్మల
దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చే నేతలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కష్టకాలంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఇప్పుడు ఒక చూపు చూడాల్సిందేనని పిలుపు నిచ్చారు. తాను కూడా అదే పద్ధతి పాటిస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకుండా ఇప్పుడు పార్టీలోకి రావాలని చూసే వారిని రానివ్వమని చెప్పారు. ఒకవేళ వచ్చినా వారికి ఎలాంటి పదవులు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని తెలిపారు. బీఆర్ఎస్ మాదిరిగా కాంగ్రెస్ కార్యకర్తలు ఉండొద్దన్నారు. గ్రామాల్లో అందరినీ కలుపుకుని, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతిఒక్కరికి అందేలా చూడాలని చెప్పారు. కార్యకర్తలకు సహకరించేందుకు నేతలు సిద్ధంగా ఉండాలని తుమ్మల సూచించారు.
కాగా తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటించారు. దమ్మపేట మండలం అల్లిపల్లి పామాయిల్ తోటలో ఏపీ, తెలంగాణ రైతులు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పామాయిల్ సాగు విస్తరణకు కేంద్రం సహకరించడం లేదని తెలిపారు. పామాయిల్‌పై ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గిస్తే రైతుకు చాలా నష్టం వస్తుందన్నారు. ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేట్ ఓఈఆర్ ఫార్మాలా ప్రకారం రైతులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రైతులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తుమ్మల పిలుపునిచ్చారు.