- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ.. ఏపీ సీఎంకు కీలక రిక్వెస్ట్..!
దిశ, తెలంగాణ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధితో ముందుకు పోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మర్యాద పూర్వకంగా కలిశారు. రెండు రాష్ట్రాలకు మేలు చేకూర్చే జాతీయ రహదారులు, జల వనరులు, రైల్వే లైన్‌లపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు, అక్కడ నుంచి పులిచింతల నాగార్జున సాగర్‌కు గోదావరి జలాలు తరలింపు భవిష్యత్‌లో కీలకమని ఏపీ సీఎంకు తుమ్మల వివరించారు. పట్టిసీమ టూ పులిచింతల లింక్‌తో శ్రీశైలం నీళ్ళు ద్వారా రాయలసీమకు సాగు నీటి కష్టాలు తీరుతాయన్నారు. దీని వలన తెలంగాణకూ మేలు జరుగుతుందన్నారు.
సత్తుపల్లి టూ కోవ్వూరు రైల్వే లైన్‌కు చొరవ చూపాలని కోరారు. పెనుబల్లి టూ కొండపల్లి రైల్వే లైన్ పనులు పూర్తయితే ఇరు రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనకరమని తుమ్మల స్పష్టం చేశారు. రైల్వే లైన్‌తో బొగ్గు రవాణాతో పాటు పుణ్య క్షేత్రాలు సందర్చించే భక్తులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. మరోవైపు కొత్తగూడెం టూ పెనుబల్లి రైల్వే లైన్ పూర్తయిందని, దీనికి ఏపీకీ లింక్ చేసేందుకు దృష్టి పెట్టాలని తుమ్మల స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా విడిపోయినా అభివృద్ధిలో కలసి సాగాలని రిక్వెస్ట్ చేశారు. జల వివాదాలు లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో సాగేందుకు చంద్రబాబు అనుభవం ఎంతో దోహదం చేస్తుందన్నారు. భద్రాచలం ఐదు గ్రామాల విలీనం ఆవశ్యకతపై చంద్రబాబు కు వివరించినట్లు తెలిపారు.