అనుకోకుండా జరిగింది.. దయచేసి నన్ను క్షమించండి: Talasani Srinivas Yadav

by GSrikanth |   ( Updated:2023-08-25 05:23:05.0  )
అనుకోకుండా జరిగింది.. దయచేసి నన్ను క్షమించండి: Talasani Srinivas Yadav
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సందర్భంగా జరిగిన సంఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. భైంసా ఏఎంసీ చైర్మన్ రాజేష్ బాబుకు, గిరిజన సమాజానికి శుక్రవారం మంత్రి క్షమాపణలు చెప్పారు. కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడిందని, ఓ వ్యక్తి నా కాలు తొక్కుతూ ముందుకెళ్లాడటంతో నా కాలుకు గాయమై రక్తమొచ్చిందని, ఆ సందర్భంగానే ఆ వ్యక్తిని నెట్టి వేశాను అన్నారు. సోషల్ మీడియాలో దీన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారని, కావాలని పెద్దగా చేసే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అతను బైంసా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ కుమార్ బాబు అని తెలిసిందని వెంటనే క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు. ఆయన గిరిజన బిడ్డా అని తెలిసిన వెంటనే ఆయనకు ఫోన్ చేసి సారీ చెప్పానని, నేను బడుగు బలహీన దళిత, మైనార్టీ గిరిజన వర్గాల గొంతుకను అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో జరిగే సేవాలాల్, కొమురం భీం జయంతి కార్యక్రమాలు ముందుండి చేస్తానని, ఆరోజు జరిగిన ఘటనపై వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే క్షమాపణ చెప్పుతున్న అని పేర్కొన్నారు. బేషజాలకు పోవాల్సిన పరిస్థితి కాదని, దయచేసి అన్యతగా భావించవద్దని విజ్ఞప్తి చేశారు. గిరిజన సమాజానికి మరోసారి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed