- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్యాసినో కేసులో ఈడీ విచారణకు Minister Talasani PA!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ తాజాగా మరోసారి క్యాసినో విచారణపై ఈడీ స్పీడ్ పెంచడం హాట్ టాపిక్ అయింది. ఈ కేసులో సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యక్తిగత సహాయకుడు అశోక్ విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో గతంలో తలసాని సోదరులు ఇద్దరు, మంత్రి ప్రైవేట్ పీఏ హరీశ్ ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్న ఈడీ అధికారులు.. ఫెమా నిబంధనల ఉల్లంఘన, హవాలా నగదు చెల్లింపులపై ఆరా తీస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ కేసులో చీకోటి ప్రవీణ్ తో బడా నేతలకు సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ సోదరులు తలసాని మహేష్ యాదవ్, ధర్మేందర్ యాదవ్ లను ఈడీ ప్రశ్నించడం ఆ తర్వాత వరుసగా ఆయన పీఏలను విచారణకు పిలవడం బీఆర్ఎస్ లో చర్చగా మారింది. కేసు దర్యాప్తు అంతా తలసాని సన్నిహితుల చుట్టే తిరుగుతుడటం వల్ల తర్వాతి టార్గెట్ మంత్రి తలసానినేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణను ప్రశ్నించిన ఈడీ.. మెదక్ డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డికి గతంలోనే నోటీసులు జారీ చేసింది. తాజా మంత్రి వ్యక్తిగత సహాయకుడు అశోక్ ను ఈడీ విచారణకు హాజరు కావడం బీఆర్ఎస్ లో ఎప్పుడు ఏం జరుగోతోందనే ఉత్కంఠ నెలకొంది.
Read More...