- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట: మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తూ నూతనంగా సీఎం కప్ పేరిట క్రీడలను నిర్వహిస్తున్నట్లు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జింఖానా మైదానంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన హైదరాబాద్ జిల్లా స్థాయి సిఎం కప్ టోర్నమెంట్ ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లు ప్రారంభించారు.. సోమవారం నుంచి మూడు రోజులపాటు 15 విభాగాలకు చెందిన క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 28 న ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలను కూడా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించినట్లు వెల్లడించారు.
రాష్ట్రస్థాయిలో ఉత్తమంగా రాణించిన క్రీడాకారులకు ప్రత్యేకంగా క్రీడా రిజర్వేషన్లలో భాగంగా ఉద్యోగ కల్పన కూడా చేయనున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం క్రీడాకారులకు బెవేరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్ స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ క్రిశాంక్ 1500 మంది క్రీడాకారులకు స్వంత నిధులతో భోజనాలు పెట్టించారు. క్రీడాకారులు క్రీడల్లో రాణించి తెలంగాణ ఖ్యాతిని దేశ నలుమూలల చాటి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ డైరెక్టర్ శ్రీ లక్ష్మీ, సికింద్రాబాద్ తహసీల్దారు శైలజ, జిల్లా స్పోర్ట్స్ అధికారి సుధాకర్, కంటోన్మెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, హెల్త్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల, బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్, శ్రీ గణేష్, ప్రవీణ్ యాదవ్, శర్విన్, సాయి తదితరులు పాల్గొన్నారు.