టీచర్స్ MLC ఎన్నికల్లో తాము పోటీ చేయట్లేదు.. మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన

by Gantepaka Srikanth |
టీచర్స్ MLC ఎన్నికల్లో తాము పోటీ చేయట్లేదు.. మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీ రిజర్వేషన్ల(BC Reservations)పై బీజేపీ(BJP) వైఖరి ఏంటో చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC Elections) ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల(BC Reservations)పై అసెంబ్లీలో తీర్మాణం చేస్తాం.. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించేందుకు.. బీఆర్ఎస్, బీజేపీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని విమర్శించారు.

ముస్లింలను బీసీల్లో తాము కలపలేదని.. కొన్ని ముస్లిం కులాలు ముందు నుంచే బీసీల్లో ఉన్నాయని అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయట్లేదని స్పష్టం చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా పరిష్కార మార్గాన్ని సూచించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని చెప్పారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. నిరుద్యోగులకు 50 వేల పైచిలుకు ఉద్యోగాలు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రైతుభరోసా వంటి అనేక పనులు చేశామని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రూప్-1 నోటిఫికేషన్ ఒక్కటే ఇచ్చారని.. అది కూడా కాంగ్రెస్ హయాంలో మాత్రమే విడుదలైనట్లు గుర్తుచేశారు. అనవసరంగా ప్రభుత్వం బురదజల్లకుండా ప్రభుత్వానికి సూచనలు చేయాలని అన్నారు.

Next Story