కాంగ్రెస్‌లో చేరిన వారికి మంత్రి శ్రీధర్ బాబు హామీ

by GSrikanth |
కాంగ్రెస్‌లో చేరిన వారికి మంత్రి శ్రీధర్ బాబు హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌లో చేరిన ప్రతి వ్యక్తికి తగిన గుర్తింపు ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమక్షంలో రామగుండానికి చెందిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామన్నారు.

ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలు చేశామని, త్వరలోనే మిగతావి కూడా ప్రజలకు చేరవేస్తామన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోకుండా ముందుకు వెళ్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పార్టీలో సీనియర్లను, తాజాగా చేరిన వారిని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. కార్యకర్తల చేరికకు సపోర్టు చేసిన ఏఐసీసీ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed