- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Seethakka : మహిళా సంఘాలకు వడ్డిలేని రుణాలు ఇప్పించేలా ప్రత్యేక డ్రైవ్ : మంత్రి సీతక్క
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో గ్రామ సభలు విధిగా నిర్వహించాలని మంత్రి సీతక్క Minister Seethakka అధికారులను ఆదేశించారు. శనివారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై డీఆర్‌డీఓలతో సచివాలయంలో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన పనులపై మంత్రి సీతక్క మార్గ నిర్దేశం చేశారు. వచ్చే అయిదు మాసాల్లో చేయాల్సిన పనులపై సమీక్ష చేశారు. నిర్దేశించుకున్న గడువు లోపు పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని, మార్చి లోపు ఉపాధి హామీ పనుల కోసం రూ. 1372 కోట్ల నిధులు ఖర్చు చేయాలని ఆదేశించారు. మహిళలకు ఉపాధి భరోసా, పంట పొలాలకు బాటలు, పండ్ల తోటల పెంపకం, ఇంకుడు గుంతలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, స్వచ్చ భారత్ మిషన్ కోసం ఉపాధి నిధులు వెచ్చించేలా క్షేత్రస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలిచ్చారు.
అదేవిధంగా గ్రామ సభల్లో ప్రజల భాగస్వామ్యం పెంచాలన్నారు. గ్రామస్తులు అభిప్రాయాలకు అనుగుణంగా ఉపాధి పనులను చేపట్టాలన్నారు. ప్రతి ఇంట్లో టాయిలెట్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణం, పంట కాలువల్లో పూడికతీత పనుల్లో వేగం పెంచాలని తెలిపారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరా మహిళా శక్తి ముఖ్య ఉద్దేశమన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతం చేయాలని, ప్రతి మహిళను స్వయం సహాయక సంఘాల్లో చేర్పించాలన్నారు. డిసెంబర్ మొదటి వారంలో మహిళా శక్తి వారోత్సవాలు నిర్వహిస్తామని, బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు ఇప్పించేలా ప్రత్యేక డ్రైవ్ చేపడతామని సీతక్క వెల్లడించారు.