- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గేట్లు తెరిచాం.. BRS ఖాళీ అవడం ఖాయం.. సీతక్క సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: చేరికలపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి వచ్చినా కాంగ్రెస్‌కు నష్టం లేదని తెలిపారు. తాము గేట్లు తెరిచాం.. ఇక బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయమని అన్నారు. కీలక నేతలు తమతో టచ్‌లో ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. పాత కాంగ్రెస్ నేతలంతా తిరిగి కాంగ్రెస్‌లో చేరబోతున్నారని అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల పైనే కుట్రలు చేసి.. ఓడగొట్టుకున్న ఘనత బీఆర్ఎస్‌దే అని ఎద్దేవా చేశారు.
కాగా, రెండ్రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్వహించిన సభలో సరిగ్గా ఇదే హెచ్చరికను బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పదే పదే ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు స్పందించి హెచ్చరించారు. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే కల్వకుంట్ల కుటుంబ సభ్యులు తప్పా ఆ పార్టీలో ఎవరూ ఉండబోరు అని సీఎ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే, తాజాగా.. తాము గేట్లు ఆల్రేడీ తెరిచామని బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమని సీతక్క చేసిన కామెంట్లు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారాయి.