వారంలోగా విద్యార్థులకు యూనిఫాం ఇవ్వాలి.. విద్యాశాఖ మంత్రి సబిత

by Javid Pasha |
వారంలోగా విద్యార్థులకు యూనిఫాం ఇవ్వాలి.. విద్యాశాఖ మంత్రి సబిత
X

దిశ, వెబ్ డెస్క్: వారంలోగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. మన ఊరు మన బడి పనులను త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందేలా చూడాలన్నారు. ప్రతి ఏటా పాఠశాలల రాష్ట్రస్థాయి అచీవ్ మెంట్ సర్వే నిర్వహిస్తామని తెలిపారు. మధ్యాహ్య భోజన కార్మికులకు పెంచిన వేతనాలను ఈ నెల నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed