- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
RTCలో 3 వేల ఉద్యోగాల భర్తీ.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ RTCలో ఉద్యోగ నియామకాలపై రవాణా శాఖ మంత్రి(Transport Minister) పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో త్వరలో TGSRTC లో 3వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామన్నారు. ఈ క్రమంలో నేడు(ఆదివారం) కరీంనగర్‌లో 33 ఎలక్ట్రిక్ బస్సులను(Electric buses) మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దసరా పండగ లోపు ఉద్యోగులకు బకాయిలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. గత పదేళ్లుగా RTCలో ఉద్యోగులు అదేవిధంగా బస్సుల సంఖ్య కూడా బాగా తగ్గి పోయిందన్నారు. కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల డీజిల్‌తో నడిచే బస్సు ఒక్కటి కూడా ఉండకుండా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ విద్యుత్ బస్సు సర్వీసులు నడపాలన్నదే తమ లక్ష్యమన్నారు. గతంలో కష్టాలను ఎదురుకొన్న ఆర్టీసీ ప్రస్తుతం సొంతగా బస్సులు కొనుగోలు చేస్తుందని వ్యాఖ్యానించారు.