గ్రామ పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొన్నం బిగ్ అప్‌డేట్

by Jakkula Mamatha |   ( Updated:2024-08-18 10:42:42.0  )
గ్రామ పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొన్నం బిగ్ అప్‌డేట్
X

దిశ,వెబ్‌డెస్క్:తెలంగాణ ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో కార్యక్రమం నిర్వహించారు. రవీంద్రభారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించని కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రభుత్వంలో శాసనసభ వేదికగా కులగణనకు కేబినెట్ తీర్మానం చేసి జీవో ఇచ్చి, 150 కోట్లు కేటాయించామని అన్నారు. ప్రజా ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగానే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కులగణన చేసిన తర్వాతనే నిర్వహిస్తామని పొన్నం స్పష్టం చేశారు. త్వరలోనే కుల గణన కార్యక్రమం జరుగుతుందని, దానిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ది ఉందని తెలిపారు.

ఇప్పటికే రేవంత్ రెడ్డి కులగణనపై పలు మార్లు ఆరా తీశారని, కులగణన కార్యక్రమం ఏ ఏజెన్సీ లేదా ఏ డిపార్ట్‌మెంట్ తో చేయించాలనే చర్చ జరుగుతుందని, మరో వారం పది రోజుల్లో కులగణన సంబంధించి జరిగిన పేపర్ వర్క్ ను బయటపెడతామని మాట ఇస్తున్నానని చెప్పారు. అలాగే రాష్ట్రంలో రెండు లక్షల మంది గీత కార్మికులకు సేఫ్టీ మోకులు ఇవ్వాలని నిర్ణయించామని, తాత్కాలికంగా 10 వేల మోకులు రెడీ అయ్యాయని అన్నారు. ఇక త్వరలోని రాష్ట్రంలోని గీత కార్మికులందరికీ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి, భవిష్యత్తులో ఏ గీత కార్మికుడు చెట్టు పై నుంచి పడి చనిపోకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed