- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ponnam Prabhakar : టీచర్స్ డే, గణేష్ ఉత్సవాలల్లో ఆ పని చేయండి.. మంత్రి పొన్నం పిలుపు
దిశ, డైనమిక్ బ్యూరో: సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చేనేత రంగంలో ఉత్పత్తి అయిన వస్త్రాలు, శాలువాలను ఉపయోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. చేనేత వస్త్రాలను ఉపయోగించినట్లయితే దీని వెనుక ఉన్న నేతన్నలందరికి ఆర్థికంగా సహకారం చేసినట్లు ఉంటుందని, ఈ క్రమంలోనే ప్రభుత్వం పక్షాన విద్యాశాఖ అధికారులను కోరారు.
సెప్టెంబర్ 5 టీచర్స్ డే రోజు సింతటిక్ శాలువాల బదులు కాటన్ శాలువాలు వాడాలని సూచించారు. మరోవైపు గణేష్ ఉత్సవాల సందర్భంలో అతిథులు వచ్చినప్పుడు కానీ ఇతర ఏ సందర్భంలో అయినా సింథటిక్ శాలువాలు ఉపయోగించే బదులు కాటన్ వాడాలన్నారు. బయట రాష్ట్రాల నుంచి ఉత్పత్తి అయ్యే సింథటిక్ శాలువాల బదులు మన తెలంగాణలో మన నేతన్నలు ఉత్పత్తి చేసే కాటన్ వస్త్రాలను ఎవరికైనా బహుమానంగా ఇవ్వాలన్నా, సన్మాన కార్యక్రమంలో అయినా కాటన్ టవల్స్ వాడాలని సూచించారు. ఒకసారి కప్పిన తర్వాత ఎందుకు ఉపయోగించుకోకుండా సింథటిక్‌ను వాడి పర్యావరణాన్ని చెడగొట్టుకోవద్దని వెల్లడించారు. పర్యావరణానికి అనుకూలంగా ఉండటంతో పాటు రోజు వారి ఉపయోగానికి వాడటం నేతన్నలకు అండగా ఉన్నట్లు ఉంటుందని, ఈ నేపథ్యంలోనే అందరూ చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.