ఉపయోగపడే సలహాలు ఇవ్వండి.. అనవసర విమర్శలొద్దు: మంత్రి పొన్నం

by GSrikanth |
ఉపయోగపడే సలహాలు ఇవ్వండి.. అనవసర విమర్శలొద్దు: మంత్రి పొన్నం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ప్రభుత్వ ప్రతిష్టాత్మక గృహజ్యోతి పథకాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీటర్ రీడింగ్ తీసి జీరో బిల్లులను మంత్రి మహిళలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమది కాలయాపన చేసే ప్రభుత్వం కాదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలు చేసినట్లు తెలిపారు. ఒక్కో ఇంటికి సుమారు వెయ్యి రూపాయల విలువజేసే కరెంట్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు వెల్లడించారు.

అభివృద్ధి చేస్తున్న కొత్త ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వండి కానీ.. అనవసరమైన విమర్శలు వద్దని హితవు పలికారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్లతో పాటు మిగతా వాగ్ధానాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఆరు గ్యారంటీల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం.. 200 యూనిట్లలోపు కరెంటు వాడే వినియోగదారులు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి నెల ప్రారంభం నుంచి అనగా శుక్రవారం నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. 200యూనిట్లకు పైన ఒక్క యూనిట్‌ అధికంగా కరెంట్‌ వాడినా పూర్తి బిల్లు కట్టాల్సిందే అని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed