అందానికి KTR ఇచ్చే డెఫినేషన్ ఏంటి?.. మంత్రి పొన్నం సూటి ప్రశ్న

by Gantepaka Srikanth |
అందానికి KTR ఇచ్చే డెఫినేషన్ ఏంటి?.. మంత్రి పొన్నం సూటి ప్రశ్న
X

దిశ, వెబ్‌డెస్క్: అందాల పోటీలపై బీఆర్ఎస్(BRS) నేత కేటీఆర్(KTR) వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందానికి కేటీఆర్ ఇచ్చే డెఫినేషన్ ఏంటని ప్రశ్నించారు. అందాల పోటీలు పెట్టడానికి హైదరాబాద్‌కు అర్హత లేదనేది కేటీఆర్ అభిప్రాయమా? అని అడిగారు. అందాల పోటీలకు, ఈ-కార్ రేసింగ్‌(Formula E-Race)కు సంబంధం లేదు.. ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఉందని అన్నారు. ఈ-కార్ రేసింగ్‌లో ప్రభుత్వ డబ్బులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తాము అందాల పోటీల నిర్వహణకు ప్రభుత్వ నిధులు కేటాయించట్లేదని స్పష్ట చేశారు.

కాగా, అంతకుముందు కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై విమర్శలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదని, ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అంటూ ఆరోపించారు. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందని, ఊసరవెల్లి ముదిరితే సీఎం రేవంత్ రెడ్డి అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సర్కార్(Congress Govt) అందమే సక్కగా లేదని, కానీ అందాల పోటీలు పెట్టేందుకు సిద్ధమవుతోందంటూ మండిపడ్డారు. ఈ బడ్జెట్‍లో ఆరు గ్యారంటీలకు పాతర వేశారు. ఎన్నికల్లో ప్రభుత్వం గొప్పగా ప్రకటించిన అనేక హామీలపై బడ్జెట్‍లో ప్రస్తావనే లేదని మండిపడ్డారు.

Next Story