KTR, హరీష్ రావులకు మంత్రి పొన్నం కీలక రిక్వెస్ట్

by Rajesh |
KTR, హరీష్ రావులకు మంత్రి పొన్నం కీలక రిక్వెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: రుణమాఫీలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రశంసించడం చేతకాకపోతే కనీసం విమర్శించకుండా ఉండాలని కేటీఆర్, హరీష్ రావులను మంత్రి పొన్నం రిక్వెస్ట్ చేశారు. బుధవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్న అనంతరం పొన్నం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతాంగానికి న్యాయం చేసేందుకు రూ.31 వేల కోట్లను బడ్జెట్‌లో పెట్టామని పొన్నం అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు 60 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని గుర్తు చేశారు. ఆర్టీసీకి ఇప్పటికే ప్రభుత్వం రూ.2050 కోట్లు ఇచ్చామన్నారు. ఆర్టీసీ స్వయం సమృద్ధిగా.. నష్టాలు లేకుండా నడుస్తోందని పొన్నం అన్నారు. 2005లో కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా రూ.70వేల కోట్లు రుణమాఫీ కోసం ఖర్చు చేస్తే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ.31 వేల కోట్లను బడ్జెట్‌లో పెట్టిందని పొన్నం తెలిపారు. రుణమాఫీ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే స్థానిక కాంగ్రెస్ నాయకులను, అధికారులను సంప్రదించాలని పొన్నం పిలుపునిచ్చారు.

Advertisement

Next Story