Minister Ponnam : గ్రీన్ వెహికిల్ ఎక్స్ పోను ప్రారంభించిన మంత్రి పొన్నం

by Y. Venkata Narasimha Reddy |
Minister Ponnam : గ్రీన్ వెహికిల్ ఎక్స్ పోను ప్రారంభించిన మంత్రి పొన్నం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో గ్రీన్ వెహికిల్ ఎక్స్ పో(Green Vehicle Expo)ను మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhaker) ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన ఎలక్ట్రిక్ వెహికిల్(New electric vehicles) లను పరిశీలించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం నివారణకు, ఇంధన పొదుపుకు ఎలక్ట్రిక్ వెహికిల్స్ వినియోగం పెరుగాల్సి ఉందన్నారు. ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా పలు రాయితీలను ప్రకటించిందని, వాహన కొనుగోలుదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

హైదరాబాద్‌ను కాలుష్య రహిత మహానగరంగా తీర్చిదిద్దడంలో అవసరమైన నియమ నిబంధనలు, విధి విధానాలు తీసుకొస్తున్నామని, ఇందుకోసం అంతా సహకరించి ఎలక్ట్రిక్ వెహికిల్స్ వినియోగం దిశగా అడుగులేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed