Ponnam: అది మీ అలవాటు.. బీఆర్ఎస్ పై పొన్నం ఫైర్

by Prasad Jukanti |
Ponnam: అది మీ అలవాటు.. బీఆర్ఎస్ పై పొన్నం ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రస్తుతం జరుగుతున్న గ్రామ సభలకు సంబంధం లేదని అలా చేయడం బీఆర్ఎస్ పార్టీ విధానం అని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ప్రభుత్వం గ్రామ సభలను నిర్వహిస్తోందని వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. శుక్రవారం ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆయన.. గ్రామసభల్లో వస్తున్న నిరసనలపై హాట్ కామెంట్స్ చేశారు. గ్రామ సభల్లో (Gram Sabha) నిరసనలు బీఆర్ఎస్ చేస్తున్నవే అని ధ్వజమెత్తారు. కృత్రిమ ఆందోళనలతో రచ్చ చేయాలని బీఆర్ఎస్ (BRS) చూస్తోందని దుయ్యబట్టారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు అందరికీ ఒకే సంవత్సరం ఇవ్వలేము కదా దశలవారీగా ఇస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ మేలు చేయాలని ప్రభుత్వం మంచి పని చేస్తుంటే బీఆర్ఎస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జాబితాలతో సంబంధం లేకుండా లబ్ధిదారులకు పథకాలు అందజేస్తామన్నారు. అప్లికేషన్, వెరిఫికేషన్ ప్రాసెస్ నిరంతర ప్రక్రియ అన్నారు.

Next Story

Most Viewed