- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Minister Ponnam: ఉద్యోగులపై దాడులు చేస్తే ఊరుకోం.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఇంటింటి సర్వేపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్వేపై బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) వదందతులను ప్రజలు నమ్మెద్దని అన్నారు. ఇంటింటి సర్వే (Household Survey)పై ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సాయం అందాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) సమగ్ర సర్వేను పారదర్శకంగా చేపడుతోందని తెలిపారు.
సమాచార గోప్యతకు సర్కార్ కట్టుబడి ఉందని.. సర్వేకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా సర్వేను అడ్డుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సమాచారం ఇవ్వడం, ఇవ్వకపోవడం ప్రజల ఇష్టమని.. సర్వేకు వచ్చిన ఉద్యోగులపై దాడులు చేస్తే మాత్రం ఊరుకోబోమని తేల్చి చెప్పారు. అన్ని వర్గాల సూచనలు, సలహాల మేరకే.. సర్వేలోని ప్రశ్నలను రూపొందించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.