Minister Ponnam : ముత్యాలమ్మ విగ్రహ పునః ప్రతిష్ఠ వేడుకలో మంత్రి పొన్నం

by Y. Venkata Narasimha Reddy |
Minister Ponnam : ముత్యాలమ్మ విగ్రహ పునః ప్రతిష్ఠ వేడుకలో మంత్రి పొన్నం
X

దిశ, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్ కుమ్మరిగూడలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి పంచలోహ విగ్రహ(Mutyalamma statue) పునః ప్రతిష్ఠ(Re-consecration ceremony)కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker) హాజరయ్యారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహం పునః ప్రతిష్ట ఉత్సవాలలో భాగంగా చండీ హోమం, అమ్మవారికి పంచగవ్య పంచామృత అభిషేకాలు చేశారు.

ఇటీవల దుండగుడు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ఆలయ అభివృద్ధి, నూతన పంచలోహ విగ్రహం ఏర్పాటుకు రూ.30లక్షలు మంజూరు చేసింది. నూతన విగ్రహాన్ని ప్రతిష్టించి నిత్య పూజలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విగ్రహ పునః ప్రతిష్ట ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి.

Advertisement

Next Story

Most Viewed