- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక హామీ
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని మంత్రి నివాసంలో ఎహ్‌యూజే సంఘం నేతలతో కలిసి డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హెచ్‌యూజే కార్యవర్గానికి, సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు జర్నలిస్టులు సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఇండ్లు, ఇండ్లస్థలాలు, ఇతర జర్నలిస్టుల సమస్యలను హెచ్‌యూజే నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
జర్నలిస్టులకు త్వరలోనే న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. సీనియారిటీని బట్టి వారిని కేటగిరీలు ఏర్పాటు చేసి, అర్హత కల్గిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని అన్నారు. ప్రభుత్వం దృష్టిలో అన్ని జర్నలిస్టు సంఘాలు సమానమేనని వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌యూజే అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్ కుమార్, బీ.జగద్వీశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, ట్రెజరర్ రాజశేఖర్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు చంద్రశేఖర్, రాధిక, రాష్ట్ర నాయకులు రామకృష్ణ, హెచ్‌యూజే ఉపాధ్యక్షులు బి.దామోదర్, నాగవాణి, రమేష్, వీరేష్, విజయ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.