- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరు ఆ ఒక్క పనిచేస్తే చాలు.. అధికారులకు మంత్రి పొంగులేటి కీలక సూచన
దిశ, జనగామ: ప్రభుత్వం చేపట్టే పనుల్లో అధికారులు నిబద్ధతతో పనిచేసి ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుండి వరంగల్ వైపునకు వెళుతూ జనగామ డీసీసీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి మంత్రికి ఘనస్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. అదే సమయంలో మంత్రి కొండా సురేఖ కూడా అక్కడకు చేరుకొని ఆయనతో పాటుగా వరంగల్ బయలుదేరారు. ఆయన వెంట డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ కూడా ఉన్నారు. మంత్రిని కలిసిన వారిలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ పింకేష్ ఫార్మర్ కుమార్, డీసీపీ సీతారాం, స్టేషన్గన్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సింగపురం ఇందిర, జిలాకు చెందిన ఆ పార్టీకి నాయకులు, కార్యకర్తలు పలువురు ఉన్నారు.