World Photography Day: తెలంగాణ ఫొటో జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి ప్రశంస

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-19 15:25:16.0  )
World Photography Day: తెలంగాణ ఫొటో జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి ప్రశంస
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫొటో జర్నలిస్టులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. సోమవారం హైదరాబాద్‌లోని దేశోద్దారక భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర స్థాయి వార్త ఫొటో ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పత్రికల్లో వార్తా కథనాలు మరచిపోయిన చాలా కాలం తర్వాత, గత సంఘటనల గురించి భవిష్యత్తు తరాలకు అవగాహన కల్పించే సామర్థ్యాన్ని చిత్రాలు కలిగి ఉంటాయని తెలిపారు. వార్తలను మరియు సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం మరియు ప్రజలకు అందించడంలో జర్నలిస్టులు సమాజంలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.

జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులు సత్యాన్ని తెలియజేసే ప్రయత్నంలో వార్తలను, చిత్రాలను అత్యున్నత పాత్రికేయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంచాలన్నారు. రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఫొటో జర్నలిస్టులు జర్నలిజం యొక్క ప్రాముఖ్యతను తమ చిత్రాల ద్వారా చూపించడంలో ప్రతిభ కనబర్చరని ప్రసంశించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎన్. హరి, ఉపాధ్యక్షులు పి.రాంమూర్తి, కోశాధికారి అనిల్ కుమార్ కర్ణకోటి, కార్యవర్గ సభ్యులు నక్క శ్రీనివాస్, పి.మోహన చారి, ఎంఏ. సర్వర్, నగర గోపాల్, ఛాయాచిత్ర ప్రదర్శన కన్వీనర్ ఏ. మహేష్ కుమార్, సభ్యులు డి. సుమన్ రెడ్డి, ఎస్. శ్రీధర్, హరిప్రేమ్, సంజయ్ చారి తదితరులు పాల్గొన్నారు.


Read More..

Minister Ponguleti: త్వరలో “ధరణి” సమస్యలకు చరమగీతం

Advertisement

Next Story

Most Viewed