- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLC దేశపతి వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసన మండలిలో తెలంగాణ తల్లి విగ్రహా మార్పుపై గురువారం సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానానికి చిహ్నంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని దేశపతి ప్రశ్నించారు. తెలంగాణ తల్లి నగలు ధరిస్తే తప్పేంటి అని అడిగారు. ప్రస్తుతం నగలు అందరూ ధరిస్తున్నారని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ఓ సామాజికవర్గ దొరసాని గుర్తుకు వస్తుందని ప్రభుత్వ పెద్దలు చెప్పడం సమంజసం కాదన్నారు. ఒక చేతిలో బతుకమ్మ, మరో చేతిలో జొన్న కంకి ఉండాలని బీఆర్ఎస్ హయాంలో నిర్ణయించారని గుర్తుచేశారు. మిగతా రూపం మొత్తం ఆర్టిస్టులే రూపొందించారని తెలిపారు. తెలంగాణ తల్లి రూపం పూర్తిగా రాష్ట్ర సంస్కృతీ, సాంప్రదాయాలను గుర్తుచేస్తుందని అన్నారు.
మార్పులు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. అనంతరం దేశపతి వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి సమాధానం చెప్పారు. తెలంగాణ తల్లి రూపం మార్పులు, చేర్పులపై కసరత్తు జరుగుతోందని వెల్లడించారు. దీనిపై అందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకున్నాకే నిర్ణయం ఉంటుందని అన్నారు. దీనిపై మరో మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిస్తూ కాకతీయ తోరణం, తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తామన్నారు. సింగిల్‌గా నిర్ణయం తీసుకోమన్నారు. బీఆర్ఎస్ నేతల సలహాలు కూడా తీసుకుంటామని వెల్లడించారు.