- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తహశీల్దార్ల బదిలీలపై కీలక అప్ డేట్ ఇచ్చిన మంత్రి పొంగులేటి
దిశ, తెలంగాణ బ్యూరో: తహశీల్దార్ల (Tahsildars) బదిలీ(transfers)లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) కీలక అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఓటర్లు జాబితా సవరణ కార్యక్రమం(స్పెషల్ సమ్మరీ రివిజన్Special Summary Revision) నడుస్తుందని, అది పూర్తయిన వెంటనే జనవరి 6 నుంచి 10ల తేదీల మధ్య పూర్వ జిల్లాలకు తహశీల్దార్ల ఎన్నికల తిరుగు బదిలీలు(రీపాట్రియేషన్ Repatriation) జరుగుతుందని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(Telangana Revenue Employees Services Association)కు మంత్రి హామీ ఇచ్చారు. ఆ దిశగా ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించనున్నట్లు మంత్రి తెలిపారు. శనివారం ట్రెసా (Tresa) అధ్యక్ష కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, కే గౌతమ్ కుమార్ నేతృత్వంలోని బృందం మంత్రిని కలిశారు. డిసెంబర్ నెలలోపు పదవీ విరమణ (retirement)పొందే తహశీల్దార్లకు బదిలీలు చేయమని ట్రెసా చేసిన విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారు. అలాంటి వారిని పూర్వ జిల్లాకు పంపిస్తామన్నారు.