Ponguleti: ఆ ప్రాంత నిరుద్యోగులకు మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్

by Prasad Jukanti |   ( Updated:2024-07-28 13:19:31.0  )
Ponguleti: ఆ ప్రాంత నిరుద్యోగులకు మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిరుద్యోగులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో జరగనున్న గ్రూప్-2,3 పరీక్షలతో పాటు రాబోయే పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్న పాలేరు నియోజకవర్గంలోని గ్రామీణ నిరుద్యోగులకు మంత్రి చేయుత ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. రాష్ట్రంలో పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న రైట్ ఛాయిస్ అకాడమీ సహకారంతో 'పొంగులేటి శీనన్న నిరుద్యోగ కానుక' పేరిట ఉచిత కోచింగ్ క్యాంప్ ను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికను ఖమ్మం జిల్లా కూసుమంచిలోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మంత్రి విడుదల చేశారు. ఈ శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పాలేరు నియోజవకర్గంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారంతా.. ఆగస్ట్ 9లోపు అభ్యర్థి పేరు, గ్రామం, మండలం వివరాలను 8985096699 ఫోన్ నెంబర్ కు వాట్సప్ లో పంపాలని నిర్వాహకులు సూచించారు. వేలకు వేలు ఫీజులు కట్టి కోచింగ్ తీసుకోలేని గ్రామీణ విద్యార్థుల కోసం మంత్రి పొంగులేటి ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed