Ponguleti vs Eleti: యూరో ఎగ్జిన్ బ్యాంకు కుంభకోణంలో మంత్రి పొంగులేటి కంపెనీ భాగస్వామి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

by Mahesh |   ( Updated:2024-07-22 12:38:26.0  )
Ponguleti vs Eleti: యూరో ఎగ్జిన్ బ్యాంకు కుంభకోణంలో మంత్రి పొంగులేటి కంపెనీ భాగస్వామి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: యూరో ఎగ్జిన్ బ్యాంకు కుంభకోణంలో మంత్రి పొంగులేటి కంపెనీ భాగస్వామి అంటూ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్ లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డికి చెందిన రాఘవ కంపెనీపై ఈ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని బ్యాంకుల జాబితాలో యూరో ఎగ్జిన్ బ్యాంకు లేదని.. దీనిని ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లగించి నడుపుతూ మోసం చేశారని అన్నారు. రాష్ట్ర మంత్రిగా పొంగులేటి కొనసాగే అర్హత లేదని.. వెంటనే యూరో ఎగ్జిన్ బ్యాంక్ గ్యారంటీలపై విచారణ జరిపించాలని ఏలేటి డిమాండ్ చేశారు. అలాగే ఈ కుంభకోణంలోని గుత్తేదారుల పేర్లు తాను త్వరలోనే బయటపెడతానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.



BRS: బడ్జెట్ సమావేశాల వేళ.. బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం

Advertisement

Next Story