- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
44 వేల మందికి రుణం మాఫీ.. మంత్రి నిరంజన్ రెడ్డి
దిశ , తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేస్తునట్టు ప్రకటించిన విదంగానే అధికారులు ఈ మేరకు ప్రక్రియను మొదలు పెట్టారు. రాష్టంలోని రూ.37 వేల నుండి రూ.41 వేల మధ్యన ఉన్న రైతులకు రుణాలు మాఫీ చేసారు. ఈ మేరకు గురువారం రూ.167.59 కోట్లు చెల్లింపుల కోసం ఆర్థికశాఖ ద్వారా నిధుల విడుదలకు చేసేందుకు సీఎం ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆగస్టు 3వ తేదీ నుంచే రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యాయని సమాచారం. ఈ రుణ మాఫీవల్ల దాదాపు 44,870 మంది రైతులకు లబ్ది పొందనున్నారు. రైతు రుణమాఫీని తక్షణమే అందించాలని ఇదివరకే సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు . ఇందుకు సంబందించిన ప్రక్రియను గురువారం నుంచే ప్రారంభించాలని స్పష్టం చేశారు. లక్షలోపు పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రూ.36 వేల వరకు బకాయిలను మాత్రమే ప్రభుత్వం విడుదల చేయగా.. ఇప్పుడు మిగిలిన వారికీ మాఫీ సొమ్మును ప్రభుత్వం అందజేయనుంది.
అయితే చాలామంది రైతుల నుంచి రైతుబంధు సొమ్మును బ్యాంకులు రుణమాఫీ కింద తీసుకున్నాయి. మరోవైపు కొత్త రుణం పొందాలంటే రెన్యువల్ చేయాల్సి ఉంటుంది . కాబట్టి రైతులు బకాయిలు చెల్లించినట్టైతే తర్వాత రుణమాఫీ సొమ్మును వారి ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కొందరు రైతులు సొంతగా బ్యాంకులకు చెల్లింపులు చేశారు. కొందరు మాత్రం చెల్లించలేకపోయారు. దీంతో లక్షలాది మంది రైతులు డిఫాల్టర్లుగా మారినట్లు అంచనా. కాగా కొత్త రుణాల రెన్యువల్ కోసం బ్యాంకులకు రుణం చెల్లించిన రైతులకు సైతం ఇప్పుడు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి.
గతంలో ప్రభుత్వం ప్రకటించిన రైతుల జాబితా ప్రకారమే సొమ్మును వారివారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇవ్వాల్సి ఉందని అధికారులు అంటున్నారు.రూ.19 వేల కోట్ల చెల్లింపుతో రూపాయి కూడా మిగలకుండా తెలంగాణలో సంపూర్ణ ‘రైతు రుణమాఫీ’కార్యక్రమం పూర్తి కానుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం 42 లక్షల ఖాతాలకు సంబంధించి రుణమాఫీ జరగనుంది. తద్వారా 29.61 లక్షల రైతు కుటుంబాలు లబ్ధి పొందనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
విడతల వారీగా.. మంత్రి నిరంజన్ రెడ్డి .
రైతుబంధు తరహాలో రుణమాఫీ కుడా విడతల వారీగా కొనసాగిస్తూ నెలా పదిహేను రోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు . ఈ మేరకు సీఎం ఆర్థిక మంత్రి హరీశ్‌రావును, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు లకు కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని అయన తెలిపారు. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని అయన పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తిరిగి చక్కబడిన నేపథ్యంలో, రాష్ట్రంలోని రైతుల పంట రుణాల మాఫీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని అయన తెలిపారు. రుణమాఫీ చేయడం పట్ల సీఎం కేసీఆర్ కు ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.