నేడు కామారెడ్డిలో మంత్రి KTR పర్యటన

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-18 05:27:00.0  )
నేడు కామారెడ్డిలో మంత్రి KTR పర్యటన
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ పోటీ చేయనున్న కామారెడ్డి సెగ్మెంట్‌లో నేడు మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కామారెడ్డి ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. మండలాల వారీగా ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కామారెడ్డిలోనే మంత్రి కేటీఆర్ ఉండనున్నారు. కేసీఆర్ విజయం కోసం చేపట్టాల్సిన కార్యచరణపై ముఖ్యనేతలకు, కార్యకర్తలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. కేటీఆర్ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సెగ్మెంట్‌లో ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక, అక్టోబర్ 7న కామారెడ్డిలో పర్యటించిన కేటీఆర్ మరో సారి ఈ సెగ్మెంట్ లో పర్యటించనుండటం ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed