- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రైతు రుణమాఫీపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన
దిశ, తెలంగాణ బ్యూరో: రైతులు ఓట్లు డబ్బాలో వేసేనాటికి 99 శాతం రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రెండోసారి రుణమాఫీ కరోనా వచ్చినా.. రెండేళ్లు లక్ష కోట్లు నష్టమొచ్చినా.. ఇచ్చిన మాట రైతులకు తప్పొద్దని.. అందులో 23 లక్షల మంది రైతుల అకౌంట్లలో 13600 కోట్లు జమచేశామని, వచ్చేవారంలో 3 వేల కోట్లు జమ చేస్తామన్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దు అని వెల్లడించారు.
టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి చేరికను పురస్కరించుకొని తెలంగాణ భవన్‌లో శుక్రవారం మంత్రి మాట్లాడారు. కేసీఆర్‌తోనే న్యాయం జరుగుతదని రైతుల్లో సర్వత్రా ఉందన్నారు. ఏ ఊరికి వెళ్లినా.. ఏ తాలూకాకైన వెళ్లండి.. ఏ జిల్లాకైనా వెళ్లండి.. తెలంగాణ రైతు ఏ కులమైన కానివ్వండి.. మీరు ఒకసారి తట్టి అడిగితే.. కేసీఆర్ పరిపాలన ఎట్ల ఉందని గుండెమీద చెయ్యి వేసుకొని స్పష్టం చెబుతాడన్నారు.
76 ఏళ్ల స్వతంత్ర్య భారత దేశంలో ఏ ఒక్క నాయకుడికి పెట్టుబడి ఇవ్వాలనే ఆలోచన రాలేదన్నారు. చాలా మంది పెద్దపెద్ద నాయకులు తలపాగ చుట్టిన నాయకులు రైతునాయకులు.. మేడలో ఆకుపచ్చకండువా వేసుకొని రైతు నాయకులమని చెప్పి... సీఎంలు, పీఎంలు అయినవారున్నారు.. రాష్ట్రపతి కూడా అయ్యారన్నారు. ఎవరికి ఆలోచన రాలేదని వెల్లడించారు. కేసీఆర్ వచ్చేదాక.. పార్టీ ఏదైనా కాదోచ్చు.. వానాకాలం, యాసంగి నాట్లకు టైం వచ్చిందంటే సెల్ ఫోన్లలో ఊరూరా టింగ్ టింగ్ అంటూ మెసేజ్‌లు వస్తున్నాయన్నారు.
రైతుబంధు కింద రూ.73వేల కోట్లు 70లక్షల రైతు ఖాతాల్లో వేశామని, కష్టమైనప్పటికీ రెండుసార్లు రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. కరోనా కష్టకాలంలో కూడా రైతు సంక్షేమం.. రైతుబంధు, రుణమాఫీ, ఉచిత కరెంటు ఆగలేదు అని వెల్లడించారు. మూడోసారి ప్రభుత్వం వచ్చినంక సన్నబియ్యంతో మూడోపూట కూడా అన్నం పెడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని, అందుకే ఆపార్టీ అంటేనే నాభీలోంచి కోసం వస్తుందన్నారు.