- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవును.. బరాబర్ మాది కుటుంబ పాలనే: కేటీఆర్ (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో: 'అవును.. మాది ముమ్మాటికీ కుటుంబ పాలనే' అని ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి కేటీఆర్ ఘాటుగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న కేటీఆర్ తమది ముమ్మాటికీ కుటుంబపాలనే అని.. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు తమ కుటుంబసభ్యులేనని వివరించారు. ఆ కుటుంబానికి సీఎం కేసీఆర్ పెద్ద కొడుకు అని చెప్పారు. అందుకే కుటుంబపాలన అంటున్న ప్రతిపక్షాల విమర్శల్ని తాము స్వీకరిస్తామని అన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రతి కుటుంబంలోని అవ్వా, తాతకు పెన్షన్ ఇస్తూ పెద్ద కొడుకులా ఆసరా అవుతున్నాడని చెప్పారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మందిని తోబుట్టువుగా చూసుకుంటున్నాడని అన్నారు. కంటి వెలుగుతో వృద్ధులకు కంటి చూపు, గురుకులాలు, కాలేజీలతో పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్న కేసీఆర్.. ఒంటరి మహిళలకు ఫించన్ ఇస్తూ పెద్దన్నలా ఆదుకుంటున్నాడని చెప్పారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పేరుతో 12 లక్షల మందికి ఆర్థిక సాయం అందించి కేసీఆర్ మేనమామలా అండగా నిలిచాడని అన్నారు.
ఇవి కూడా చదవండి: ఇంత దుర్మార్గమైన ప్రధాని ప్రపంచంలోనే ఎక్కడా లేరు: మంత్రి KTR
Credit Score చెక్ చేస్తున్నారా.. 750 కంటే తక్కువగా ఉంటే పరిస్థితేంటి?