‘‘ధన్యవాదాలు అమిత్ షా జీ’’.. హోంమంత్రిపై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్

by Satheesh |
‘‘ధన్యవాదాలు అమిత్ షా జీ’’.. హోంమంత్రిపై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ‘పునాది వేసినందుకు హెచ్‌ఎం అమిత్ షా జీకి ధన్యవాదాలు’ అంటూ ఆదివారం సెటైరికల్ ట్వీట్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. ఐటీఐఆర్‌ మంజూరు చేయలేదని, పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదని, హైదరాబాద్‌ మెట్రో రెండో దశ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్‌, ట్రిపుల్‌ ఐటీ, ఐఐటీ, ఎన్‌ఐడీ, నవోదయ, మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలు ఇవ్వలేదంటూ ట్వీట్ చేశారు. గత తొమ్మిదేళ్లలో తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్న ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రాన్ని చూపించగలరా అంటూ పేర్కొన్నారు. అమిత్‌షాను ట్యాగ్‌ చేస్తూ కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ చర్చనీయాంశమైంది.

Next Story

Most Viewed