రేపే కేటీఆర్ బర్త్ డే.. సంచలన నిర్ణయం తీసుకున్న మంత్రి

by Javid Pasha |
రేపే కేటీఆర్ బర్త్ డే.. సంచలన నిర్ణయం తీసుకున్న మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు 47వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. కాగా రేపు తన పుట్టిన రోజును పురస్కరించుకొని ట్విట్టర్ వేదికగా మంత్రి కీలక ప్రకటన చేశారు. యూసఫ్ గూడలోని అనాధాశ్రమానికి తన వంతుగా ఏదైనా సాయం చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తన 47వ బర్త్ డే సందర్భంగా ఆ అనాధాశ్రమానికి చెందిన ప్రతిభావంతులైన 47 మంది టెన్త్/ ఇంటర్ విద్యార్థులకు, అదేవిధంగా ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న మరో 47 మంది విద్యార్థులకు సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

గిఫ్ట్ ఏ స్మైల్ సంస్థ తరఫున పైన పేర్కొన్న విద్యార్థులకు ఒక ల్యాప్ టాప్ కంప్యూటర్ తో పాటు రెండేళ్ల పాటు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. కష్టాలతో సహవాసం చేస్తూ తమ కలల సాకారం కోసం పరితపిస్తున్న ఆ చిన్నారులు రాష్ట్ర సంపద అని అన్నారు. తన పుట్టిన రోజున ప్రకటనలకు డబ్బు ఖర్చుపెట్టే బదులు అనాధ పిల్లలకు తమకు తోచిన విధంగా సాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ సూచించారు.

Advertisement

Next Story