ఆకలి సూచీలో 107 స్థానంలో భారత్‌.. కేంద్రంపై కేటీఆర్‌ సెటైర్

by GSrikanth |
ఆకలి సూచీలో 107 స్థానంలో భారత్‌.. కేంద్రంపై కేటీఆర్‌ సెటైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆకలి సూచీలో భారత్ అట్టడుగున చేరడంతో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. 121 దేశాల జాబితాతో విడుదలైన హంగర్ ఇండెక్స్‌లో భారత్ 107 స్థానంలో నిలిచింది. ఈ అంశంపై కేటీఆర్ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఎన్‌పీఏ గవర్నమెంట్‌ సాధించిన మరో అద్భుతమైన విజయం ఇది అంటూ ఎద్దేవా చేశారు. ఆకలి సూచీలో భారత్ 101వ స్థానం నుంచి 107వ స్థానానికి చేరిందని తెలిపారు. ఈ ఫెయిల్యూర్‌ను బీజేపీ జోకర్స్ అంగీకరించకుండా‌.. భారత్‌కు వ్యతిరేకంగా వచ్చిన నివేదిక అని కొట్టిపారేస్తారని తాను అనుకుంటున్నానని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


Advertisement

Next Story

Most Viewed