- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేముల ప్రశాంత్ రెడ్డిని పరామర్శించిన మంత్రి KTR
X
దిశ, ఆర్మూర్ : రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లోని వారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మంజులమ్మ చిత్ర పటానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మంత్రి వేములను, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ చైర్మన్ బద్దం మధుశేఖర్, పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు, నాయకులు పండిత్ పవన్, సంజయ్ సింగ్ బబ్లు, ఆకుల రజనీష్, జనార్దన్ గౌడ్, పోల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story