- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా: కాంగ్రెస్‌కు మంత్రి KTR సవాల్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ టెండర్ అంశంలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. ఓఆర్ఆర్ టెండర్లలో అవినీతి జరిగినట్లు కాంగ్రెస్ నిరూపిస్తే తాను ఏ పదవి తీసుకోనని తెలిపారు. తప్పి చేసినట్లు రుజువైతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ చాలెంజ్ చేశారు.
ప్రజాశీర్వాదంతో అధికారంలో ఉన్నామని.. వాళ్లు కాదంటే ఇంటికెళ్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, ఓఆర్ఆర్ టెండర్లలో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగిందని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తక్కువ ధరకే వారికి అనుకూలమైన కంపెనీకి ఓఆర్ఆర్‌ను లీజుకు ఇచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్ టెండర్లపై కాంగ్రెస్ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్ విసరడం హాట్ టాపిక్‌గా మారింది.
Read More..
ఉన్నదే 10 మంది.. కానీ అందరూ CM అభ్యర్థులే: కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు